DEER: జాతీయ రహదారిపై జింక... వీడియో వైరల్ - vishaka district latest news
విశాఖ మధురవాడ జాతీయ రహదారిలో.. క్రికెట్ స్టేడియానికి సమీపంలో.. ఓ జింక హల్ చల్ చేసింది. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి ఆ జింక వచ్చి.. రోడ్లపై కాసేపు పరుగులు పెట్టింది. కాసేపటికి తిరిగి కొండలవైపు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విశాఖ కంబాల కొండా, జూ సమీపంలో, సింహాచల కొండలో జింకలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.