ఆంధ్రప్రదేశ్

andhra pradesh

yuvagalam_padayatra_updates

ETV Bharat / videos

కోలాహలంగా యువగళం పాదయాత్ర - లోకేశ్‌ వెంట నడిచిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులు - Yuvagalam Padayatra news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 3:56 PM IST

Updated : Dec 18, 2023, 4:44 PM IST

Yuvagalam Padayatra Updates:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో కోలాహలంగా కొనసాగుతోంది. నేటి (226వ రోజు) పాదయాత్రను ఆయన విశాఖ క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర చివరి రోజు కావడంతో తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రహ్మణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి యువనేత లోకేశ్ అడుగులు వేశారు. 

Yuvagalam End in Visakha Shivajinagar: టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న 'యువగళం' పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన 3,132 కిలోమీటర్లు నడిచారు. లోకేశ్‌‌ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈరోజు దాకా అన్ని జిల్లాల్లో కార్యకర్తలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో చివరి రోజు పాదయాత్రలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, ప్రజలు లోకేశ్‌ను చూడటానికి తరలివచ్చారు. దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. 'మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవ నిర్వాహకులతో లోకేశ్ ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత విశాఖ శివాజీనగర్‌లో పాదయాత్రను ముగించి, అక్కడ ఆయన పైలాన్ ఆవిష్కరించనున్నారు.' అని పార్టీ నేతలు వెల్లడించారు.

Last Updated : Dec 18, 2023, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details