YSRCP Leaders Dance With Girls: యువతులతో వైఎస్సార్సీపీ నేతల రికార్డింగ్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ - డ్యాన్సులతో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు
YSRCP Leaders Dance With Girls : వైఎస్సాసీపీ నాయకులు తమ పదవులు మరిచి ఓ వేడుకలో యువతులతో నృత్యాలు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోను చూసిన వాళ్లు విమర్శల వర్షం కురిపిస్తూ.. అధికార పార్టీ నాయకులకు నిబంధనలు ఉండవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్యాన్సులతో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు : కాకినాడ జిల్లాలో వైఎస్సాసీపీ నాయకులు ఓ వేడుకలో యువతులతో చిందులేశారు. ఏలేశ్వరం మండలం యర్రవరం శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రికార్డింగ్ డ్యాన్స్ తరహాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. యర్రవరానికి చెందిన రైతు తన బంధువు పుట్టినరోజు వేడుకలను వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులను ఆహ్వానించి యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. యర్రవరం సర్పంచి బీశెట్టి అప్పలరాజు, గ్రామ హనుమాన్ ఆలయ ధర్మకర్త గంగాధర్, జడ్పీటీసీ సభ్యురాలి భర్త, వైఎస్సాసీపీ నాయకుడు నీరుకొండ సత్య నారాయణ ఐటెం సాంగ్‌లకు యువతులతో కలిసి నృత్యాలు చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. ఈ వీడియోను చూసిన వారంత ప్రజా ప్రతినిధులు అమ్మాయిలతో డ్యాన్సులు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్లీల నృత్యాల తరహాలో డ్యాన్సులు నిర్వహిస్తున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.