మద్యం మత్తులో వైఎస్సార్సీపీ కార్యకర్తల హల్ చల్ - టీడీపీ నేతల కారుపై దాడి! - ysrcpnewsyearcelabrations
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 7:26 AM IST
YSRCP activists attacked on TDP leaders car: గుంటూరులోని లక్మీపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలతో రోడ్డుపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. జై జగన్, జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై భయానక వాతావరణం సృష్టించారు. అటుగా వెళ్తున్న తెలుగుదేశం నేతల కారును అడ్డగించారు. కారుపై రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో కారు అద్దాలు పగిలాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసుల మాటలు వినలేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు బతిమాలుకుని అక్కడి నుంచి పంపించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిసి కూడా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలవైపే వకాల్తా పుచ్చుకున్నారని ఆరోపించారు. నడిరోడ్డుపై ఇంతలా హంగామా చేస్తున్నా, పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. పైగా తామే తప్పు చేసినట్లుగా వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపంచారని ఆరోపించారు.