Youth Protest by Hanging Around Neck: జాబు రావాలంటే బాబు రావాలి.. మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరుద్యోగుల నిరసన - Unemployed youth Protest by Hanging Around Neck
Unemployed Youth Protest by Hanging Around Neck:విజయవాడలోని పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో నిరుద్యోగ యువత వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ ఎక్కడ జగన్ అంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నాయ్ కానీ.. జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదంటూ లోకేశ్ యువగళానికి నిరుద్యోగులు మద్దతు తెలిపారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన గ్రూప్, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలు సున్నా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ నిరుద్యోగ యువత యువగళానికి మద్దతు తెలిపారు.
Lokesh Padayatra Route Map:లోకేశ్ పాదయాత్ర 189వ రోజైన నేడు విజయవాడ తూర్పు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల మీదుగా సాగుతోంది. విజయవాడ తూర్పులో బందరు రోడ్డు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పటమట ఎన్టీఆర్ సర్కిల్, హైస్కూల్ రోడ్, ఆటోనగర్ మీదుగా పాదయాత్ర సాగుతోంది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కానూరు, తాడిగడప, పోరంకి మీదుగా సాగనుంది. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రాత్రికి లోకేశ్ నిడమానూరు శివారులో బస చేయనున్నారు.