ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Seediri Appalaraju Comments

ETV Bharat / videos

Seediri Appalaraju Comments: పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలి: సీదిరి అప్పలరాజు - మంత్రిపై ఆరోపణలు

By

Published : Jun 24, 2023, 10:34 PM IST

Updated : Jun 25, 2023, 6:38 AM IST

Seediri Appalaraju Satirical Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్ నిలకడ లేని రాజకీయ నాయకుడని... మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  మీడియాతో మాట్లాడిన మంత్రి సీదిరి పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.  సీఎం అని చెప్పే ముందు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో  చెప్పాలన్నారు. జనసేన అధినేత ఏన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారో తెలియనప్పుడు.. ఎలా ముఖ్యమంత్రి అవుతారన్నారు. జనసేన కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకే.. పవన్ కల్యాణ్  సీఎం అవుతానని  అన్నానని ఆయనే చెప్పారన్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్​ను ఎందుకు చేయ్యాలో చెప్పాలని  మంత్రి సీదిరి అప్పలరాజు.. పవన్ కల్యాణ్​ను ప్రశ్నించారు.  ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారో చెప్పాలని సీదిరి డిమాండ్ చేశారు. పవన్ చంద్రబాబు వంతపాడితే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని సీదిరి అప్పలరాజు  విమర్శించాడు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాల్లో మాత్రం... రామ్మోహన్ నాయుడు నెంబర్ వన్  అని సీదిరి ఎద్దేవా చేశాడు. 

Last Updated : Jun 25, 2023, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details