వైసీపీ నేతల సెటిల్మెంట్ అడ్డాగా రైతుభరోసా కేంద్రం! కేకలు, అరుపులతో బెంబేలెత్తిన స్థానికులు - Anarchy of YCP leaders in Dwarkathiruma
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 9:42 PM IST
YCP Leaders Settlements in Rythu Bharosa Kendram:రాష్ట్రంలో రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆకృత్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను తమ ప్రైవేట్ సెటిల్మెంట్కు అడ్డాగా మార్చేసి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. ఇటీవల ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చి పుట్టినరోజు వేడుకలు జరపటంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ నాయకులు తాజాగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులోని ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఘటనపై స్థానికుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఆదివారం రోజున ఎంతో దర్జాగా ఆర్బికే తాళాలు తీసి మరి ప్రైవేట్ సెటిల్మెంట్కు పాల్పడ్డారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఆర్బీకేలను వైసీపీ నాయకులే స్వయంగా ప్రైవేటు సెటిల్మెంట్ అడ్డాగా తయారు చేశారు.
ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. దాన్ని సరి చేసే నిమిత్తం సెటిల్మెంట్కు ఆర్బీకే కేంద్రాన్ని ఉపయేగించారు. ఈ సెటిల్మెంట్లో గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులు గన్నమని వెంకటేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేలికాని రాజబాబు, మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, జడ్పీటీసీ సామ్యూల్, ఎంపీపీ భర్త వెంకన్న బాబు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలను అందునా సెలవిదినం రోజున ఈ విధంగా ప్రైవేటు సెటిల్మెంట్కు అడ్డగా మార్చి వైసీపీ నాయకులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.