'జపాన్లో లేను స్వగ్రామంలోనే ఉన్నా' - ఓటు తొలగించడంతో ఓ రైతు ఆవేదన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 3:37 PM IST
YCP Leaders Removing TDP Supporters Votes:టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర తన కుటుంబతో కలసి పొలికి గ్రామంలోనే నివసిస్తున్నారు. స్వగ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలోని కమ్మకొట్టాల వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. పొలం వద్దే ఉంటూ పనులు చూసుకుంటున్నారు. గ్రామానికి రోజు విడిచి రోజు వచ్చి వెళ్తున్నారు. ఈయన జపాన్లో ఉంటున్నారని ఓటు తొలగించాలని ఎన్నికల అధికారులకు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
రెండు నెలల కిందట బీఎల్వో విచారణ చేసి, గ్రామాంలోనే ఉన్నట్లు వివరాలు నమోదు చేసుకున్నారు. మరోసారి తొలగింపు జాబితాలో అధికారులు ప్రస్తావించారు. నోటీసులు జారీ జాబితాలో ఆయన పేరు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి రావడంతో రైతు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం తాను ఇక్కడే మిరప పంటను సాగు చేస్తున్నానంటూ రైతు నాగేంద్ర వాపోయారు. మిరపను సాగు చేస్తున్నానంటూ రైతు నాగేంద్ర సెల్ఫీ తీసి అధికారులకు పంపారు.