ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_leaders_occupied_land_in_sk_university

ETV Bharat / videos

ఏకంగా యూనివర్శిటీ భూములకే ఎసలు పెట్టారు - ఎస్కేయూలో 150 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతల పన్నాగం - Land Occupied in SK University

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 4:57 PM IST

YCP Leaders Occupied 150 Acres of Land in SK University:అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. రాత్రికి రాత్రే కంచ ఏర్పాటు చేసి జగనన్న కాలనీ కోసం భూమిని కేటాయించామంటూ చెప్పుకొచ్చారు. ఎస్కే యూనివర్సిటీ కి సంబంధించి దాదాపు 500 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 150 ఎకరాల వరకు ఖాళీగా ఉంది. ఇదంతా ఆక్రమణలకు గురికాకుండా గతంలోనే అధికారులు చుట్టూ ప్రహరీ నిర్మించారు. జగనన్న ఇళ్ల కోసమని స్థానిక ఎమ్మెల్యే అండతో వైసీపీ నాయకులు ఐదు ఎకరాలలో కంచ ఏర్పాటు చేశారు. ఎస్కే యూనివర్సిటీ భూమిలో కంచ ఏర్పాటు చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. 

ఇదంతా స్థానిక ఎమ్మెల్యే కనుసనల్లోనే జరిగిందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులకు ప్రభుత్వ భూములే కాకుండా యూనివర్సిటీ భూములు కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉన్న వీసి రామకృష్ణారెడ్డి యూనివర్సిటీ భూమిని వైసీపీ నాయకులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నట్లు అనుమానం కలుగుతొందన్నారు. యూనివర్సిటీ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details