ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Leaders Destroyed TDP Silapalakalu

ETV Bharat / videos

YCP Leaders Destroyed TDP Silapalakalu : టీడీపీపై అక్కసుతో అధికార పార్టీ నేతల అరాచకాలు.. - chittoor latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 1:51 PM IST

YCP Leaders Destroyed TDP  Silapalakalu :చిత్తూరు జిల్లా కుప్పంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టీడీపీ  శిలాఫలకాలను అధికార పార్టీ నేతలు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి కోసం అవిష్కరించిన శిలాఫలకాలను వైసీపీ వర్గీయులు రాత్రివేళ ధ్వంసం చేశారని తెలిపారు. తెలుగుదేశంపై అక్కసుతో శిలాఫలకాలు, గతంలో నాటిన చెట్లు నరికి వేసినట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు అంటున్నారు.

YCP Leaders Destroyed TDP Stone Plaques And Trees in Chittoor  : టీడీపీపై అక్కసుతో శిలా ఫలకాలను ధ్వంసం చేయండం, చెట్లు నరికి వేత వంటి  చర్యలు చేపడుతున్నారని పలువురు టీడీపీ నేతలు మండిపడ్డారు. మండల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే దీనికి ఒడిగట్టి నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎంత అధికారంలో ఉన్నంత మాత్రాన ఇటువటి పనులు తలపెట్టడం సరికాదని టీడీపీ నేతలు, వైసీపీ నేతల వైఖరిని వ్యతిరేఖించారు.
 

ABOUT THE AUTHOR

...view details