ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాడిపత్రి మున్సిపల్​ కార్యలయం ఎదుట ఆందోళన

ETV Bharat / videos

YSRCP Leader Protest: ఇలా అయితే ప్రజల్లోకి వెళ్లలేము.. వైసీపీ నాయకుడి ఆవేదన - వైసీపీ నేతల నిరసన

By

Published : Jun 7, 2023, 5:28 PM IST

YSRCP Protest on Sanitation in Tadipatri : తమ సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని వైసీపీ నాయకుడు రమేశ్​ రెడ్డి నిరసన చేపట్టారు. పరిశుభ్రతపై ప్రజలు నిలదీసినప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన వాపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్​ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణంలో మురుగునీటి వ్వవస్థ అధ్వానంగా ఉందని మండిపడ్డారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేయటం లేదని, చేత్త సేకరణ కూడా లేదని.. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విషయంలో కొంతమంది సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మేము ప్రజల్లోకి వెళ్లలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరసన చేపడుతున్న రమేశ్​ రెడ్డి వద్దకు మున్సిపల్​ డీఈ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రమేశ్​ రెడ్డి డీఈకి సమాధానమిస్తూ.. వార్డుల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నారు. ప్రజలు పరిశుభ్రతపై నిలదీస్తున్నారని వాపోయారు. సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా పరిష్కరించేది లేదా అని రమేశ్​ రెడ్డి డీఈని నిలదీశారు. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు కనీసం స్పందించకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details