తప్పుల తడకగా ఓటర్ల జాబితా - ఆర్టీవోకు టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి వినతిపత్రం - టీడీపీ నేతలతో ఆర్టీవో కు వినతిపత్రం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 5:08 PM IST
Voter List Corrections in Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారిందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు ఉండటం, తెలుగుకు బదులుగా తమిళ అక్షరాలతో ఓటరు పేర్లు నమోదు కావడం వంటివి జాబితాలో చోటుచేసుకున్నాయని వివరించారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి సరైన ఓట్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఆర్టీవో కు వినతిపత్రం అందజేశారు.
TDP Leader With RDO Officer on Voter List : అనుభవం ఉన్న బీఎల్వోలతో ఓట్ల తనిఖీ నిర్వహించాలని కోరారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో పరిశీలన చేయిస్తే మరలా తప్పిదాలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. కనిగిరి నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సరైన పద్దతి కాదని ఆర్డీవోకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే సరైన ఓటర్ల జాబితా అవసరం అని ఆర్డీవోతో అన్నారు.