Volunteer Murder His Uncle: వాలంటీర్ ఘాతుకం.. భూ పంపకాల్లో సొంత పెదనాన్నను కడతేర్చిన వైనం - కర్నూలు జిల్లా లేటెస్ట్ క్రైమ్ న్యూస్
Volunteer Murder His Uncle: కర్నూలు జిల్లాలోని దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నూతన పల్లె గ్రామంలో పొలం పంపకాల్లో వివాదం తలెత్తడంతో ఓ వాలంటీర్ తన సొంత పెద్దనాన్నను కడతేర్చాడు. వాలంటీర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులకు నూతన పల్లె గ్రామంలో నాలుగు ఎకరాలు పొలం ఉంది. ప్రస్తుతం గ్రామంలో భూసర్వే జరుగుతుండటంతో ప్రవీణ్ పెద్దనాన్న ఆరోగ్య స్వామి కుటుంబ సభ్యులు రీ సర్వే చేయించి సమభాగాలు పంచుకుందామని కోరారు. దానికి ప్రవీణ్ అంగీకరించలేదని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ గొడవపై బాధిత కుటుంబ సభ్యులు 3 నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా ఆ కుటుంబంలో మరోమారు వివాదం తలెత్తెంది. ఈ క్రమంలోనే వాలంటీర్ ప్రవీణ్, అతడి సోదరుడు రాజశేఖర్ కర్రలు, రాళ్లతో బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరోగ్యస్వామి తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. బాలస్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.