Variety Ganesh Idols in Chirala : చీరాలలో మ్యాగీ, హార్లిక్స్, బూస్ట్ ప్యాకెట్లతో గణపతి విగ్రహలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 1:46 PM IST
Variety Ganesh Idols in Chirala : బాపట్ల జిల్లా చీరాలలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలోని ఆర్. ఆర్ రోడ్డలో వెరైటీగా ప్రతిమలను తయారు చేశారు. ఇంట్లో రోజు వాడుకునే టీ, కాఫీ పొడి, హార్లిక్స్, బూస్ట్, షాంపూ, మ్యాగీ ప్యాకెట్లతో వినాయకుడిని అలంకరించారు.
షాంపూ, టీ, కాఫీ పొడి ప్యాకెట్లతో అలకరించిన గణపతి ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్యాకెట్లను ఆదివారం రోజున భక్తలకు పంచి పెడతామని నిర్వాహకులు తెలిపారు. అలానే మండలంలోని ఈపురుపాలెంలో 12 కిలోల లడ్డుతో వినాయకుడుని తయారు చేశారు. గణేశుని ప్రసాదంగా భక్తులకు ఇస్తామని తెలిపారు. వినాయక చవితి పండగ రోజు గణనాథుడి విగ్రహం పెట్టడం సర్వసాధారణం. అయితే భక్తులు అన్ని విగ్రహాల కంటే తమ ప్రతిమ వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. చంద్రయాన్ 3, చాక్లెట్, కొబ్బరికాయలు, కరెన్సీ నోట్లు, చెరకు గడలు ఇలా విభన్న రూపాల్లో వినాయకుడి భక్తులు అలంకరించారు.