Tomato Prices మోత మోగిస్తున్న టమోటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో రూ.80 - మదనపల్లె మార్కెట్ యార్డు
Tomato Prices: టమాటా ధరల పెరుగుతూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో నష్టాలొచ్చాయని అంటున్న రైతులు.. ఇప్పుడు ధరలు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమాటా ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల మొదటి వారంలో కిలో 15 నుంచి 18 రూపాయలు పలికిన టమాట ధర రోజురోజుకూ పుంజుకుంటోంది. నెల మధ్యలో కిలో 50 నుంచి 60 రూపాయలకు చేరువకాగా.. చివరి వారంలో ఏకంగా 80 రూపాయలకు చేరింది. సీజన్ ప్రారంభంలో నష్టాలొచ్చాయని.. చివరి దశలో ధరలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతోనే ధరలు కాస్త ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్‌కు 1400 మెట్రిక్ టన్నులు పంట రాగా.. ప్రస్తుతం 800 నుంచి 900 మెట్రిక్ టన్నుల టమాట వస్తోందని వారు వివరించారు. మదనపల్లె మార్కెట్ యార్డు నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా, కోస్తాంధ్రలకు టమాట ఎగుమతి అవుతోంది.