Contract workers fire on CM ''మాట తప్పారు.. వెన్నుపోటు పొడిచారు.. " కాంట్రాక్టు ఉద్యోగుల ఆగ్రహం - కటాఫ్ విధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు
Contract employees are angry over the cutoff imposed by the government: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాష్ట్రంలో రాజకీయ మంటలు రేపుతోంది. క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కటాఫ్ విధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న తమకు కనీస గుర్తింపు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవ్వలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నామని క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడించిందని ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఒప్పంద,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామిఇచ్చి నేడు షరతులు విధిస్తున్నారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఆశించాం.. రెగ్యులర్ చేస్తారేమేనని అనుకున్నాం.. కానీ, ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రతి ఒక్కరినీ రెగ్యులర్ చేస్తామని ప్రతి పక్ష నేతగా ఇచ్చిన హామీని నెరవేర్చైలని కోరుతున్నాం. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులందరీని క్రమబద్దీకరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తం అందోళన చేపడతామని చెబుతున్న ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.