ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసుల మెడలో సీఎం జగన్ ఫొటో

ETV Bharat / videos

పోలీసుల మెడలో సీఎం జగన్ ఫొటో.. డిపార్ట్ మెంట్ షాక్! - police identity card

By

Published : Mar 19, 2023, 9:37 PM IST

special cards for police : ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం బహిరంగసభ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు సీఎం ఫొటోతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులు ధరించడం చర్చనీయాంశమైంది. సీఎం బహిరంగ సభలకు పలు ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం రప్పిస్తారు. వీరందరూ పోలీసు డిపార్టుమెంట్ జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించేవారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ సారి ఆ నిబంధనలను పక్కన పెట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులకు సీఎం జగన్ ఫొటో తో కూడిన ఐడెంటిటీ కార్డులను తయారు చేసి పోలీసులకు ఇచ్చి తప్పక ధరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పోలీసు డిపార్టు మెంట్ ఇచ్చిన ఐడీ కార్డులను ధరించకుండా వీటిని మెడలో వేసుకోవాలని సూచించారు. దీంతో సభా స్థలి వద్ద జగన్ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును మెడలో వేసుకుని పోలీసులు విధులు నిర్వహించారు. మీడియా చిత్రీకరించడంతో... కార్డు వెనక్కి‌తిప్పి ఉంచుకోవాలంటూ సిబ్బందికి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లోగో తో జారీ చేసిన కార్డులు కాకుండా సీఎం ఫొటోతో గుర్తింపు కార్డులు మెడలో ధరించాలనడంపై పలువురు పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details