Shops Demolished in Kuppam: వైసీపీ నాయకుడి అరాచకం.. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలు కూల్చివేత - కుప్పం వీడియోలు
TDP sympathizers shops demolished: చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల దుకాణాలను అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా కూల్చివేశారు. మల్లానూరు గ్రామంలో స్థానిక వినాయక ఆలయం వద్ద 40 ఏళ్ల క్రితం దుకాణాలు ఏర్పాటు చేసుకుని పలువురు జీవనం సాగిస్తున్నారు. ఈ స్థలం ఆలయానికి చెందిందంటూ వైసీపీ నాయకులు కోర్టులో కేసు వేశారు. ఇదే అంశంపై దుకాణదారులు సైతం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ముఖ్య నాయకుడు తన అనుచరులతో ప్రొక్లయిన్తో దుకాణాలు కూల్చివేత చేపట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులపై దాడి చేశారు. తాము తెలుగు దేశం పార్టీకి చెందిన వారిమని, తమపై కక్ష సాధించడంలో భాగంగానే.. అధికార పార్టీ నాయకుడు దుకాణాలు కూల్చివేతకు పాల్పడ్డాడని బాధితులు వాపోయారు. తమకు జరిగిన అన్యాయంపై.. బాధితులంతా కలిసి అధికార పార్టీ నేత దౌర్జన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.