ఆంధ్రప్రదేశ్

andhra pradesh

teachers_protest

ETV Bharat / videos

Teachers Protest Against GPS Ordinance: జీపీఎస్‌ ఆర్డినెన్స్ ముసాయిదాపై ఉపాధ్యాయుల ఆగ్రహం.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆక్రందన పేరుతో ఆందోళన - Teachers protest against GPS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 7:43 PM IST

 Teachers Protest Against GPS Ordinance  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చట్టం 2023తో పాటుగా ఏపీ గ్యారెంటెడ్​ పెన్షన్ స్కీమ్ చట్టం 2023కు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. రెండు చట్టాలను ఆమోదించిన అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. ఇలా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు తప్ప మరే ప్రతిపాదనకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వ కక్షపూరిత ధోరణి నిరసిస్తూ ఆక్రందన పేరుతో గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపట్టారు. సంస్కరణల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆరోపించారు. జీపీఎస్ ఆర్డినెన్స్, డీఏ బకాయిలు, వేతనాలు ఆలశ్యం కావటం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details