ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP MLC Ashok babu on Govt Employees Salaries: '11వ తేదీ వచ్చినా.. ఉద్యోగులకు జీతాల్లేవ్.. వైసీపీ మంత్రులు నోరు మెదపరే'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 3:51 PM IST

TDP MLC Ashokbabu

TDP MLC Ashok babu on Govt Employees Salaries: ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరని... తెలుగుదేశం ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు నిలదీశారు. చిలకపలుకులతో జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు(Salaries) ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రిని అడగలేరంటూ విమర్శించారు. జీతాలు, పింఛన్లకు నెలకు 5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే, జగన్(Jagan) సర్కార్ నేటికి కేవలం 2,500 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. అగ్నిపర్వతంలోని లావాలా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా దహిస్తారని మండిపడ్డారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమతో లేరని సకలశాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైందని అన్నారు. 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో కేవలం లక్షన్నర మందే నీలిరక్తం నింపుకున్నారనే నిజాన్ని.. ముఖ్యమంత్రి తెలుసుకోవాలని అశోక్‌బాబు హితవుపలికారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు తెస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయని అశోక్ బాబు(Ashok babu) మండిపడ్డారు. కొందరు మంత్రులు జీతాలు ఆలస్యమైతే ఏమవుతుందని అంటున్నారని.. ఉద్యోగుల  ( Employees ) సమస్యలపై మంత్రులు చేసే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details