TDP Leaders Protest 'దళితుడిని చంపిన వ్యక్తికి.. సభను నిర్వహించుకునేందుకు ఎలా అనుమతిస్తున్నారు' - TDP leaders house arrest
TDP Leaders Protest: అల్లూరి జిల్లా కూనవరంలో ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీంతో ఈ నిరసనలను పోలీసుసు అడ్డుకున్నారు. ప్రతిపక్షాల నేతలు అడ్డుకోకుండా ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బహిరంగ సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి.. బెయిల్పై ఉన్న వ్యక్తికి సభకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజూ దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. అనంత బాబుకు ప్రభుత్వం, పోలీసులు కొమ్ముకాయడన్ని.. దళిత సంఘాలు, టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత యువకుడిని చంపి.. ఈ రోజు ప్రజల్లోకి రావడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి.. అనంతబాబుకు సపోర్ట్ చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని సభలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు. అనంతబాబు సభకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మద్దతు ఉందని ఆరోపించారు.