Ayyanna Comments: దుర్మార్గాలపై పోరాడుతున్న సునీతకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి: అయ్యన్న - అయ్యన్నపాత్రుడు
TDP Leader Ayyanna Fires on CM Jagan: దుర్మార్గులపై పోరాడుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను అభినందిస్తున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నంద్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. మనసున్న ప్రజలు ఆమెకు అండగా నిలవాలని ఆయన కోరారు. భగవంతుని అనుగ్రహం ఆమెకు ఉండాలని వేడుకున్నారు. మహామహులను అరెస్టు చేసిన సీబీఐ.. ఒక ఎంపీని ఎందుకు అరెస్టు చేయలేకపోతుందని అయ్యన్న ప్రశ్నించారు. దీని వెనుక జరుగుతున్న వ్యవహారం తెలియాల్సి ఉందన్నారు.
సీబీఐ కేసులో బెయిల్‌పై ఎక్కువ కాలం బయట ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్‌కు బెయిల్ తెచ్చేందుకు సీఎం జగన్ కృషి చేసారే తప్ప రాష్ట్రానికి ఏమి చేయలేదన్నారు. ఈ సమావేశంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.