ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Secretary_TDP_Janasena_Joint_Future_Plan

ETV Bharat / videos

దీపావళి తర్వాత అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన విస్తృతస్థాయి సమావేశాలు: చింతకాయల విజయ్ - tdp janasena joint news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 8:07 PM IST

Updated : Nov 12, 2023, 6:43 AM IST

TDP General Secretary on TDP-Janasena Joint Future Plan: దీపావళి తరువాత టీడీపీ-జనసేన ఉమ్మడి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వెల్లడించారు. ఆ సమావేశాల ద్వారా ప్రజలు, జనసైనికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ముందుకు వెళ్లనున్నామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి కరపత్రంలోనూ, ఫ్లెక్సీలలోనూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల ఫోటోలు ప్రింట్ చేయనున్నామని తెలిపారు.

Chintakayala Vijay Comments:టీడీపీ-జనసేన ఉమ్మడి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''దీపావళి తరువాత అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ సమావేశాల్లో ఉమ్మడిగా ప్రణాళికలు రూపొందిస్తాం. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. పోలవరం, అమరావతిని విస్మరించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారు. నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ మొదలుకొని మాకవరపాలెంలోకి ఇసుక దోపిడీ చేస్తున్నారు. దీపావళి తర్వాత ఉమ్మడిగా అన్ని సమస్యలపై పోరాటం చేస్తాం.'' అని ఆయన అన్నారు. 

Last Updated : Nov 12, 2023, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details