Simhadri appanna సింహాద్రి అప్పన్నకు స్వర్ణ తులసీదళార్చన - సింహాచలం దేవస్థానం
Simhadri appanna swarna tulasi dalarchana : విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు ఆలయ అధికారులు వైభవంగా 108 స్వర్ణ తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. స్వామివారి స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. అనంతరం శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధీష్టింప జేశారు. అనంతరం వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణ తులసీదళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిపై తమ భక్తిని వివిధ రూపాల్లో కనబర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేపలో తరించారు. భక్తులకు ఎటుంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.