ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap_high_court

ETV Bharat / videos

Supreme Court Recommended Four Judges to AP High Court: హైకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు.. కొలీజియం ఉత్తర్వులు - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 4:42 PM IST

Supreme Court Recommended Four Judges to AP High Court:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు సీనియర్ అడ్వకేట్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, న్యాపతి విజయ్, సుమతి జగడం​ను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి.. ఈ నలుగురు న్యాయవాదులను నియమించాలని సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులను సీఎం జగన్, గవర్నర్ ఏకీభవించారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం (Coliseum) ఈ సిఫార్సులు చేసింది. ఏపీ హైకోర్టులోని సీనియర్ అడ్వకేట్లు.. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి అలియాస్ కిరణ్మయి కనపర్తి, జగడం సుమతి, న్యాపతి విజయ్ లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తున్నట్లు సీజేఐ నేతృత్వంలోని కొలిజీయం పేర్కొంది. త్వరలోనే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వీరు నియమితులవుతారని స్పష్టం చేసింది. ఈ నలుగురు రికార్డులు పరిశీలించిన తర్వాత వారిని న్యాయమూర్తులుగా నియమించినట్లు తెలిపారు. ఈ నలుగురు న్యాయవాదుల అర్హతలను బట్టి వారిని హైకోర్టుకు ఎలివేషన్ చేసేందుకు న్యాయశాఖను సంప్రదించినట్లు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details