Son killed father: తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని.. కర్రతో కొట్టి చంపిన కుమారుడు! - AP Crime news
son killed his father: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రజక బజారులో దారుణం చోటుచేసుకుంది. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని కొడుకు తండ్రిని కర్రతో దాడి చేసి హతమార్చాడు. మొదట తీవ్రంగా గాయపడ్డ తండ్రిని కుటుంబ సభ్యులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే తండ్రి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రజక బజారుకు చెందిన నగరి వెంకటేశ్వర్లు (60) బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వచ్చిన డబ్బును దుబారా చేస్తూ మద్యం తాగి భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తర్వాత గొడవ సద్దుమనగడంతో అందరూ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు మరోమారు భార్యపై నోరు పారేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన కొడుకు రసూల్ తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ తండ్రి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. పరారైన కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు