మంచు దుప్పటి కప్పిన మన్యం - రహదారులపై దట్టమైన పొగమంచు - manyam news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 1:07 PM IST
Snow Covered Roads in Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో బుధవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రంపచోడవరం నుంచి దేవీపట్నం రహదారిలో ఉన్న మూసురుమిల్లి, భూపతి జలాశయాలు పొగమంచుతో పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఓ వైపు చలి మరోవైపు దట్టమైన మంచుతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయం దాటిన మంచు వీడలేదు. ప్రధాన రహదారులు, కొండలు మంచుతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి.
People Suffering from Snow : రంపచోడవరంలో దట్టమైన మంచు కారణంగా రహదారి కనిపించక వాహనాాదారులు నిదానంగా వెళ్తున్నారు. ఉదయం 8 గంటలు అయినా మంచు తాకిడి తగ్గపోవడంతో వాహనదారులు రహదారులపై ప్రయాణించడానికి విముఖత చూపుతున్నారు. దీంతో రోడ్లులన్నీ నిర్మానుష్యంగా దర్శనం ఇచ్చాయి. మన్యంలో పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు క్షీణించాయి. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉదయమే పనుల మీద బయటికి వెళ్లే వారు, బడి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జలాశయాలు మంచుతో చూపరులను ఆకట్టుకున్నాయి.