Education officers negligenc: అధికారుల నిర్లక్ష్యం.. మరణించిన మాస్టారుకు విధులు కేటాయింపు.. ఎక్కడంటే? - Guntur District Education today news
Education Department officers negligence: అనారోగ్య కారణాల చేత చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి.. విద్యాశాఖ అధికారులు పదోవ తరగతి ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేసే విధులను కేటాయించటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరు నెలల కిందటే అనారోగ్య సమస్యలతో మరణించిన నాగయ్య మాస్టారు.. పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాలను ఎట్లా మూల్యాంకనం చేస్తారు..?, ఆయన మరణించారు కదా..? అంటూ సహా ఉద్యోగులు, స్థానికులు విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ ఈ నాగయ్య మాస్టారు..?, మరణించిన వ్యక్తికీ విధులు కేటాయించిన అధికారులు ఎవరో తెలుకుందామా..
గుంటూరు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ఐతానగరం హైస్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాగయ్య.. అనారోగ్య సమస్యలతో ఆరు నెలల క్రితం మరణించారు. అయితే.. తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులు చనిపోయిన ఆ నాగయ్య మాస్టారుకు పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయాలంటూ విధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో నాగయ్య మాస్టారు కుటుంబ సభ్యులు, సహా ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరణించిన నాగయ్య మాస్టారు.. పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయడం ఏంటీ..?, ఆయన మరణించారు కదా..? అంటూ ఆశ్చర్యానికి లోనైయ్యారు. అనంతరం పాఠశాల వీఎంసీ ఛైర్మన్ స్పందనలో ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంత నిర్లక్ష్యమా..! ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ మధిర రాజు మాట్లాడుతూ.. ''సుమారు ఆరు నెలల క్రితం చనిపోయిన నాగయ్య మాస్టారు అనే వ్యక్తికీ ఈరోజు టెన్త్ క్లాసు స్పాట్ వాల్యువేషన్‌కి వెళ్లాలంటూ ప్రస్తుత గుంటూరు జిల్లా డీఈఓ శైలజ ఆర్డర్ పంపించారు. చనిపోయిన వ్యక్తికీ ఆర్డర్ పంపించారంటే ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తున్నారు. విధుల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.