Pratidwani: బీదాబిక్కి ఇళ్లు కూల్చి రోడ్డున పడేయడం ఎంతవరకు.. - ప్రతిధ్వని చర్చ
కూల్చివేతలు. మూడేళ్లుగా రాష్ట్రంలో తరచూ వినిపిస్తునే ఉన్న మాట ఇది. ప్రజావేదికతో మొదలు అయింది ఈ పరంపర. ఆ తర్వాత ఒకటో, రెండో కాదు. వివిధ నాయకులు, సంస్థలకు చెందిన భూములు, నిర్మాణాలపైకి బుల్‌డోజర్లు నడుస్తునే ఉన్నాయి. అయితే ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ల కూల్చివేత మాత్రం వాటన్నింటికీ పరాకాష్ఠ అంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు.. బాధిత గ్రామస్థులు. జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల నివాసాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారని, జనసేనసభకు భూమి ఇచ్చామనే ఇంతటిస్థాయిలో కక్షసాధించారని గ్రామస్థులు వాపోతున్నారు. రాజకీయాల సంగతి పక్కనపెట్టినా, బీదాబిక్కి ఇళ్లు కూల్చి రోడ్డున పడేయడం ఎంతవరకు సమర్థనీయం అన్నప్రశ్నలకు సమాధానం ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST