prathidhwani: లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతు..! - ఎన్నికల సంఘం అంశంపై ప్రతిధ్వని
prathidhwani: మీ ఓటు ఉందా.. గల్లంతయిందా? కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. ఎదురవుతున్న ప్రశ్న ఇదే. వేలు.. లక్షల సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు మాయమవుతున్నాయి. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా విచారణ చేసి తొలగిస్తున్నామని అధికారులు చెబుతుంటే.. పనిగట్టుకుని .. వాలంటీర్లను అడ్డంపెట్టుకుని రాష్ట్రప్రభుత్వం తమఓట్లే తీసేస్తున్నారని విపక్షాలు వాపోతున్నాయి . కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా లక్షలకొద్దీ ఓట్లు తొలగించడం దారుణం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు.. నిబంధనల ప్రకారం ఓట్ల తొలగింపు, జాబితాలో మార్పులుచేర్పులకు నిర్థేశించిన పద్ధతేంటి? అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఓట్లు తీసేస్తున్నారన్న ఫిర్యాదులు ఎందుకు? గతేడాది చివరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలోనే భారీగా ఓటర్లు తగ్గారు. 63 నియోజకవర్గాల్లో ఓటర్లు-జనాభా నిష్పత్తి అసాధారణ స్థాయిలో నమోదవ్వడం దేనికి సంకేతం? ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా తయారీ ప్రాథమిక దశ. ఇప్పుడీ జాబితాల రూపకల్పన దశలోనే లోపాలు జరుగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఈసీపై ఉన్న బాధ్యత ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.