PRATHIDWANI ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు, విమర్శలపై సమాధానమేది - tdp protest
Prathidwani.. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ దుమారానికీ కేంద్ర బిందువు అయింది. తెలుగువారి ఆరాధ్యుడు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రికైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరునే ఉన్నపళంగా మార్చేసింది వైకాపా సర్కార్. ఆ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లును తీసుకుని వచ్చారు. దీనిపైనే భగ్గుమంటున్న విపక్షాలు.. ఎన్టీఆర్ పేరు మార్చడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఎలా వచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అసలు ఉన్నట్లుండి.. ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చింది? దానిపై విమర్శలకు సమాధానం ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST