Prathidwani: ఐటీ విస్తరణ, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఏపీ ఎక్కడ..? - వైసీపీ ప్రభుత్వం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 9:44 PM IST
Prathidwani: పొరుగు రాష్ట్రం తెలంగాణ ఐటీ రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.. తెలంగాణలో ఐటీ రంగం వార్షిక ఎగుమతులు, కొలువుల కల్పన పరంగా.. దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలే అక్కడి ఐటీ రంగం జోరుకు.. అద్ధం పడుతున్నాయి. మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? దేశంలో కొత్తగా వస్తోన్న ఐటీ ఉద్యోగాల్లో 30 నుంచి 40 శాతం మా వద్దనే అని గర్వంగా ప్రకటిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాలుగేళ్లలో కొత్తగా వచ్చిన ఐటీ ఉద్యోగాలెన్ని? అసలు ఐటీ రంగంలో పొరుగు రాష్ట్రం అంతలా అభివృద్ధి సాధిస్తున్న క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ అవకాశాలు ఎలా చేజారి పోయాయి. ఏపీలో ఐటీ వృత్తి నిపుణుల ఉపాధి అవకాశాల, ఆదాయాల్లో ఎలాంటి పెరుగుదల కనిపిస్తోంది. ఐటీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది? కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణలో అనుమతులు, ప్రోత్సాహాలూ ఎలా ఉన్నాయి? వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.