Prathidwani: కాపు సంక్షేమానికి జగన్ ఇచ్చిన హామీలేంటి..? నాలుగేళ్లలో ఏం చేశారు..? - కాపు సంక్షేమంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని
Prathidwani: రాష్ట్రంలో.. కాపు సంక్షేమం విషయంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి ఏం హామీలు ఇచ్చారు? నాలుగేళ్ల పాలనలో వాటి అమలు ఎలా ఉంది? ప్రస్తుతం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు జరుగుతున్న మేలెంత? కాపునేస్తం, కాపు కార్పొరేషన్ ద్వారా ఆశించిన లక్ష్యాలు ఎంత వరకు నెరవేరుతున్నాయి? కాపు సంక్షేమానికి అన్ని విధాల పని చేసింది ఎవరు? చేయనిది ఎవరు? పైపై ప్రకటనలు పక్కనపెడితే.. రాష్ట్రంలో కాపుల పట్ల వైసీపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది?
అన్నింటికీ మించి.. కాపు నేస్తం పథకం. ఈ విషయంలో అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి అని వైసీపీ ప్రభుత్వం అంటోంది. కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 2వేల కోట్ల రూపాయ కేటాయింపు, ఖర్చు చేస్తాము అన్న వాగ్దానం నెరవేరిందా? విదేశీ విద్య, పోటీ పరీక్షలకు శిక్షణ వంటి కార్యక్రమాల మాట ఏమిటి? అగ్రవర్ణ పేదలకు ఉద్ధేశించిన ఈబీసీ రిజర్వేషన్లలో నుంచి 5శాతం గత ప్రభుత్వం కాపులకు కల్పించింది. దానికి ఆమోదం కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎలా ఉంది?.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.