PRATHIDWANI: ఇప్పుడైనా వైఎస్ వివేకా హత్య కేసు పరుగులు తీసేనా - కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
PRATHIDWANI: తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. జాతీయస్థాయిలో పెను సంచలనం సృష్టించిన కేసు వైఎస్ వివేకా హత్యోదంతం. గుండెపోటు అన్న మాట నుంచి గొడ్డలివేటుతో మొదలైన ఈ క్రైమ్ స్టోరీలో ప్రతి ఘట్టం ఉత్కంఠ భరితమే. చనిపోయింది ఒక మాజీ సీఎం సోదరుడు, మరో ప్రస్తుత సీఎం బాబాయి కావడంతో అది మరింత పెరిగింది. అయినా.. ఆయన సొంత రాష్ట్రంలో వ్యవస్థల మీద నమ్మకం పోయి పక్క రాష్ట్రానికి తరలి పోయింది కేసు. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద హత్యకేసులో విచారణకు రావాలంటూ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఆయన చంపించి ఉంటారని ఇప్పటికే ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న సీబీఐ ఇప్పుడు నోటీసులివ్వడంతో... పొరుగు రాష్ట్రానికి వచ్చాకనైనా ఈ కేసు పరుగులు తీసేనా అన్నది అందరిలో చర్చ జరుగుతోన్న విషయం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఇవీ చదవండి :