PRATHIDWANI: ఓటరు జాబితాపై దిల్లీకి ఫిర్యాదులు.. ఇంటింటికి ఓటరు సర్వే
Prathidwani: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా.. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుమారం. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు గల్లంతవడం ఒక ఎత్తయితే.. నకిలీ ఓట్ల చేరికల గురించి ప్రతిపక్ష పార్టీలు వరుసగా అనేక ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆ దుమారం దిల్లీ వరకు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హాజరు కావాల్సి వచ్చింది. ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు జరిగాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అంగీకరించారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు రాష్ట్రంలో ఇంటింటికీ ఓటరు సర్వేకు రంగం సిద్ధం చేశారు. అసలు ఈ పరిణామాల్లో రాష్ట్రంలోని అధికార పక్షం, యంత్రాంగంపై ఉన్న అభ్యంతరాలేంటి..? వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం, ఐప్యాక్‌కు ప్రజల సమాచారం చేరవేత, డేటా చౌర్యం ఆరోపణల నేపథ్యంలో.. ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటే మేలు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది.