ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని

ETV Bharat / videos

Pratidwani: ఉన్నత విద్య దారెటు..? ఆ పరిణామాలు దేనికి సంకేతం..! - నాక్

By

Published : Jun 20, 2023, 9:43 PM IST

Pratidwani: రాష్ట్రంలో ఉన్నతవిద్య దారెటు? బోధనా సిబ్బందిలో భారీ సంఖ్యలో ఖాళీలు.. దిగజారుతున్న ర్యాంకులే ఈ ప్రశ్నకు కారణం. విశ్వవిద్యాలయాలకు సమృద్ధిగా నిధులు ఇవ్వకపోగా.. వాటి నిధులే ప్రభుత్వం లాగేసుకుంటున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నాలుగేళ్లల్లో ఒక్కటంటే ఒక్క అధ్యాపక పోస్టునూ భర్తీ చేయలేదు. ఫలితంగానే.. ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది. పీజీ చదువులో నాణ్యత లేదని విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే దయనీయమైన స్థితి నెలకొంది. చివరికి ఉపకులపతి పోస్టులకూ దరఖాస్తులు తగ్గిపోతున్న పరిస్థితి. కొన్ని విశ్వవిద్యాలయాలైతే రాజకీయ కేంద్రాలుగా మారాయన్న దుమారం సరేసరి. అసలు ఎందుకీ పరిస్థితి. ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..? రాష్ట్రవ్యాప్తంగా మొత్తం విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నాలుగేళ్లుగా ఎన్ని నింపారు.. రాష్ట్రంలో ఉన్నత విద్య స్థితిగతులకు సంబంధించి నాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు ఏం చెబుతున్నాయి? ఈ పరిణామాలు దేనికి సంకేతం..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details