కాగ్ ప్రశ్నలకు ప్రభుత్వ సమాధానమేంటి..? - తాజా వార్తలు
Prathidwani: లెక్కల్ని మసిపూసి మారేడు కాయ చేశారు. అప్పులకుప్పలపై నిజాలు దాచారు. శాసనసభకు చెప్పకుండా ఆర్థికనిర్వహణను ఆగమాగం చేశారు. అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రయోజిత పథకాల రూపంలో వచ్చిన వేల కోట్ల రూపాయలు మురిగిపోయేలా చేశారు. పద్దుల్లో ఏమార్చి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వాస్తవ ముఖచిత్రం అంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ ఇవన్నీ విపక్షాలో.. గిట్టని వారో చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కాదు... దేశంలోనే సుప్రీం ఆడిట్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చెబుతున్న చేదు నిజాలు. అసలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రజల నెత్తిన ఉన్న అప్పులు ఎంత? ఇదే కొనసాగితే రాష్ట్ర ఆర్థికరథం పయనమెటు? కనీసం బడ్జెట్ పరిధిలు పట్టించుకోని... శాసనసభకు సమాచారం ఇవ్వని ఈ ఆర్ధిక నిర్వహణను ఏమనాలి? కాగ్ అడిగిన ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, అధికారుల వద్ద సమాధానం ఉందా? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.