prathidhwani: రాష్ట్రంలో పౌర హక్కులకు దిక్కేది..? - రాజకీయాలపై ప్రతిధ్వని
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 10:26 PM IST
prathidhwani: ఈ నిరంకుశ వాతావరణంలో హక్కులకు దిక్కెవరు...? ఇప్పుడు రాష్ట్రంలో నలుదిక్కులా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలే కాదు... రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తాలంటే భయపడేలా చేస్తున్న పరిస్థితులే అందుకు కారణం. ఏ రోజు చూసినా.. అరెస్టులు, నిర్భంధాలు, అణిచివేతల వార్తల్లేని పొద్దుపోవడం లేదు. అసలు.. ప్రాథమిహక్కుల స్ఫూర్తి ఏం చెబుతోంది? మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది? శాంతియుత నిరసనలు, వాక్‌స్వాతంత్ర్యంపై న్యాయస్థానాల తీర్పులనైనా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకుంటోందా? అసలు ప్రజాస్వామ్యవ్యవస్థ లోఈ పోకడలు దేనికి సంకేతం? ఒక వ్యక్తి తప్పు చేసినట్టు కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా, చూపకుండా నేరాభియోగాలు మోపుతూ జైళ్లలో మగ్గేలా చేయటం మన వ్యవస్థలో అంత తేలికా? అలా అయితే ప్రతి ప్రభుత్వమూ తనకి గిట్టని వాళ్లని ఇలాగే ఖైదు చేస్తే సగటు పౌరుడికి న్యాయం దక్కేదెలా? ఇది ఒక చంద్రబాబు నాయుడికి సంబంధించిన అంశంగా కాకుండా పౌరుల హక్కుల కోణంలో ఆలోచిస్తే ఏం అనిపిస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.