Prathidhwani జగన్‌పై కోడికత్తి దాడి ఘటనకు ఐదేళ్లు.. కేసు తీరుతెన్నులేంటీ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 9:17 PM IST
Prathidhwani: ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి హత్యాయత్నం చేశాడని జనుపల్లి శ్రీనుపై కేసు కట్టి, జైల్లో పెట్టి సరిగ్గా అయిదేళ్లు. ఈ అయిదేళ్లలో కేసు పురోగతి ఏమిటి? నిందితుడు శ్రీనివాస్‌కు అయిదేళ్లుగా కనీసం బెయిల్ కూడా ఎందుకు రావడం లేదు? ఒక దళిత యువకుడు 5 ఏళ్లుగా జైల్లో మగ్గి పోతున్నాడు. దీనిపై జగన్ కోర్టుకు వచ్చి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అదే చెప్పండని శ్రీను కుటుంబ సభ్యులు ఎన్నో విధాల వేడుకుంటున్నారు. కోర్టుకు రాకుండా ఎందుకు మన సీఎం ఈ కేసును సాగదీస్తున్నారు? తనపై హత్యాయత్నం జరిగిందని ఆనాడు జగన్ ఎంతో హడావుడి చేశారు. ఏపీ పోలీసులను కానీ, ఏపీ డాక్టర్లను కానీ తాను నమ్మను అని చెప్పాడు. కేంద్ర సంస్థల దర్యాప్తు కావాలి అని అడిగారు. ఇప్పుడు అదే జాతీయ దర్యాప్తు సంస్థ ఇందులో కుట్రలేదని చెప్పింది. జగన్ కూడా తనే సీఎం అయ్యారు. అధికారం చేతిలో ఉంది. కానీ ఎందుకు కోడికత్తి కేసు ఒక కొలిక్కి రావట్లేదు? వైకాపా ప్రభుత్వం సామాజిక న్యాయ యాత్రలు అని చేస్తోంది కదా? నిజంగా ఈ ప్రభుత్వంలో దళిత, బహుజన, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందా? వారి యాత్రలకు ప్రజా స్పందన ఉంటుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.