జగన్ రాజ్యాంగంలో హక్కులు హరీ!
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 10:12 PM IST
Prathidhwani: మాట కాదంటే... పగబట్టి వేధింపులు. ఆర్థిక వనరులపై అన్నివైపుల నుంచి దాడులు. అధికార దండాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిక్షాల మీద, తమకు గిట్టని వారిపైనా జగన్ ప్రభుత్వం సాగిస్తోన్న అరాచక వేధింపుల పర్వమిదే. ప్రస్తుతానికి వార్తల్లో కనిపిస్తోన్నది గొట్టిపాటి రవికుమార్, బీటెక్ రవి, ధూళిపాళ్ల నరేంద్ర మాత్రమే. నాలుగున్నరేళ్ల వైసీపీ ఏలుబడిలో లెక్కలు చూస్తే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రాంతానికో కథ ఉంది, వ్యథి ఉంది... ఈ నిర్వాకాలకు సంబంధించి. అక్రమ కేసులు, అరెస్టులు, బెదిరింపులు, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకునేలా చేయడం ఇలా ఎన్నో. అసలు ప్రత్యర్థి పార్టీల పట్ల వైసీపీ ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది? విపక్షాల ముందున్న మార్గమేంటి? ప్రతిపక్ష నాయకుల వ్యాపారాలను, ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం ద్వారా జగన్ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వదలుచుకుంది?ప్రతిక్షాలే లేకుండా చేద్దామనే స్థాయి నుంచి ప్రతిపక్ష ఓటర్లనే లేకుండా చేద్దామనే జగన్ ప్రభుత్వ అరాచకాలను రాబోయే నాలుగు నెలల్లో ఎలా తిప్పి కొడతారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.