PRATHIDWANI: రాజధానిపై వైసీపీ పెద్దల ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలి?
PRATHIDHWANI : రాష్ట్ర రాజధానిపై వైసీపీ పెద్దలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా, సుప్రీం విచారణ పూర్తి కాకుండానే ప్రభుత్వ ముఖ్యులు ఇలా అనొచ్చా? మొదట అమరావతే మా రాజధాని అని చెప్పిన వైసీపీ.. గెలిచిన తర్వాత 3రాజధానుల పల్లవి అందుకున్న వైనం. ఇప్పుడు విశాఖే రాజధాని అంటూ కీలక నేతల ప్రకటనలు.. 3 ప్రాంతాల వారు ఈ ప్రకటనలెలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నా రాజధానిని కూడా.. కట్టుకోలేకపోవటంపై సగటు ఆంధ్రుడు ఏం అనుకోవాలి? రాజధాని కట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టా? లేనట్టా? అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు వేయలేకపోయారు? అసెంబ్లీ సాక్షిగా సరే అని సీఎం అయ్యాక మాటెందుకు మార్చారు? అధికారంలోకి రాగానే ఎందుకు ఆయన వైఖరి మారింది? అమరావతి రాజధానికి అవసరమైన భూములు ఉన్నాయి. పరిపాలన నడవటానికి అవసరమైన భవనాలు ఉన్నాయి? అలాంటప్పుడు రాజధానిని మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? మూడున్నరేళ్ల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులు అమరావతి పరిరక్షణ ఉద్యమం ఎటు మలుపు తీసుకోబోతోంది?