ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani: అమరావతి... అసలేం జరుగుతోంది?

ETV Bharat / videos

Prathidhwani: అమరావతి... అసలేం జరుగుతోంది? - అమరావతి రాజధాని అంశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 10:06 PM IST

Updated : Sep 21, 2023, 10:15 PM IST

Prathidhwani: అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా పరిపాలన విశాఖ నుంచి చేస్తామనే సందేశం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఎలా చూడాలి? ఇది వ్యవస్థల పట్ల లెక్కలేని తనం కాదా? తాము ఏమైనా చేయగలమనే ధీమానా?  మంచి ఆదాయం వచ్చే పొలం ప్రభుత్వం చేతికి పోయింది. దాని మీద ఇవ్వాల్సిన కౌలు కూడా సక్రమంగా ప్రభుత్వం చెల్లించట్లేదు. రైతు కుటుంబాలకు ఇది కష్టంగా లేదా?  అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందా? ఏఏ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోంది? రైతు అనే వాడు తన పొలాన్ని బిడ్డలా చూసుకుంటాడు. చూస్తూ చూస్తూ ఒకరికి ధారాదత్తం చేయటానికి ఏ రైతుకీ మనస్సు రాదు. కానీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేశారని, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక రాజధాని కడతామని ప్రభుత్వం వచ్చి అడిగితే అమరావతి రైతులు తమ పంట పొలాలు ఇచ్చారు. ఈరోజు ఆ రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలు అందరి మీదా లేదా?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

Last Updated : Sep 21, 2023, 10:15 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details