ఆంధ్రప్రదేశ్

andhra pradesh

people_protest_to_mla_sucharitha

ETV Bharat / videos

ఎమ్మెల్యే సుచరితకు నిరసన సెగ - తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిలదీసిన మహిళలు - ఎమ్మెల్యే సుచరితకు నిరసన సెగ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 7:19 PM IST

People Protest to MLA Sucharitha : గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలనకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితకు నిరసన సెగ ఎదురైంది. కాకుమానులో పర్యటించిన సుచరితను ఎస్సీ కాలనీ మహిళలు అడ్డుకున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరి నానా అవస్థలు పడినప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని సుచరితను నిలదీశారు. పునరావాస కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారో అధికారులు ఎవరూ చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇలా సుచరిత పర్యటించిన ప్రతి వీధిలోనూ సమస్యలు గురించి మహిళలు వివరించారు. దీంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సుచరిత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

People are Suffering Due to the Cyclone : మిగ్​జాం తుపాను తాకిడికి రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఒకవైపు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాంటే, మరోవైపు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి నానా అవస్థలు పడుతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details