Operation Chirutha in Tirumala: తిరుమలలో చిరుతల కోసం అన్వేషణ.. భక్తులకు కనిపించిన ఎలుగుబంటి - tirumala news
Monitoring Cheetah Movement With Cameras in Tirumala: తిరుమల కాలిబాటలో క్రూర మృగాల జాడలను తితిదే అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చిరుత కోసం నరసింహ ఆలయం సమీప ప్రాంతంలో అటవీ శాఖ పది బోనులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించిన బోనుల ద్వారా చిరుతలను పట్టేందుకు వాడనున్నారు. నిన్న అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నరసింహ ఆలయ అటవీలో చిరుతలు, ఎలుగుబంటులు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కెమెరాల్లో రికార్డు అయిన ఫొటోలను అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు. ఇవాళ మరోసారి సాయంత్రం నరసింహ ఆలయం వద్ద ఎలుగు బంటి సంచరించింది. దీంతో అక్కడ ఎలుగు బంటిని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు.. కాలిబాటలో వచ్చే భక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కొందరు మాపై సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన వదంతులు సృష్టిస్తున్నారని.. ఇలాంటివి భక్తులు నమ్మరాదని తితిదే అటవీ శాఖ అధికారులు ప్రకటనలో కోరారు.. భక్తుల పట్ల పూర్తి రక్షణ తీసుకుంటామని తెలిపారు.