రేపటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలు - Nijam Gelavali
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 3:18 PM IST
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra:తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రేపటి నుంచి 'నిజం గెలవాలి' పర్యటనలు మళ్లీ ప్రారంభించనున్నారు. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి నిర్వహించనున్నారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, ఈ నెల నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా, ఐదో తేదీన విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.
చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు భువనేశ్వరి బాసటగా నిలిచారు. ఇప్పుడు మరోసారి, ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆయా కుటుంబాలన్నింటిని భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ‘నిజం గెలవాలి’ పేరిట నారా భువనేశ్వరి పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.