సమ్మెకు సిద్ధమైన మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు - Municipal workers strike in Nellore
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 10:30 PM IST
Municipal Workers Strike in Anantapur :కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు చెప్పారు. అదేవిధంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు.
Concerns of Municipal Workers in Nellore : సప్తగిరి సర్కిల్ నుంచి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటివరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరులో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నిరవధిక సమ్మెకు వెళ్తామని కార్మికులు తెలిపారు.