ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మందకృష్ణ మాదిగ

ETV Bharat / videos

Manda Krishna Madiga Comments: 'జగన్ ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు' - వైసీపీ ప్రభుత్వంపై మంద క్రిష్ణ ఫైర్

By

Published : Jun 17, 2023, 1:52 PM IST

Manda Krishna Madiga Comments: వైఎస్సార్​సీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు రోజువారీ తంతుగా మారాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. గుంటూరు జిల్లా.. కొల్లిపర మండలం పిడపర్రు గ్రామంలో వైఎస్సార్​సీపీ నాయకుల దాడిలో గాయపడ్డ దళిత నాయకుడు మోహన్​ను ఆయన పరామర్శించారు. అతనికి అండగా ఉంటామని దైర్యం చెప్పారు. వల్లభాపురం గ్రామం నుంచి పిడపర్రు గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమూరి మోహన్​ని అధికార పార్టీ నేత అరుణ్ కుమార్ రెడ్డి కులం పేరుతో ధూషించడమే కాకుండా  అతనిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. 

బాధితుడు దళితుడు కాబట్టి పోలీసులు నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కేసు నుంచి అతని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు, ఆత్మగౌరవానికి రక్షణ లేదని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యాక్ట్​ను నీరుగారుస్తోందని.. దళితుల ప్రాణాలు పోయేలా చేస్తోందని దుయ్యబట్టారు. దళితుల ఆవేదన ఆగ్రహంగా మారితే జగన్ ప్రభుత్వానికే నష్టమని మందకృష్ట హెచ్చరించారు.  
 

ABOUT THE AUTHOR

...view details