ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇద్దరు కుమార్తెలతో చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్య

ETV Bharat / videos

Mother suicide with daughters ఇద్దరు కుమార్తెలతో చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్య - Crime news

By

Published : Jul 2, 2023, 6:24 PM IST

Updated : Jul 2, 2023, 10:48 PM IST

Mother commits suicide with daughters:  శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో తీవ్ర విషాదం నెలకొంది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లే.. ఆ ఇద్దరు కుమార్తెలను చెరువులోకి తోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన.. ఈ ఘటనలో కుటుంబ కలహాలతో సుకన్య అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలయిన దేవయాని (8), జస్మిత (6)లను ముదిగుబ్బ వద్ద చెరువులో నీటిలోకి విసిరేసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువులోకి పిల్లలను విసురుతున్న దృశ్యాన్ని స్థానికులు గమనించి అక్కడికి పరుగు తీసే సమయానికే ఇద్దరు పిల్లలను చెరువులో నెట్టేసి.. తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. రైతులు చెరువులో దూకి ఇద్దరు పిల్లలను వెలికి తీయగా.. అప్పటికే వారు మృతి చెందారు. కొంత సేపటికి సుకన్య మృతదేహాన్ని బయటకు తీశారు. ఒకేసారి తల్లి ఇద్దరు కుమార్తెలు మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. ముదిగుబ్బ టీచర్స్ కాలనీలో నివాసముంటున్న గంగాధర్​కు భార్య సుకన్యకు తరచూ గొడవలు జరుగుతుండేవని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ దశలో ఆదివారం ఉదయాన్నే భర్తతో గొడవపడి చెరువు వద్దకు వెళ్లి తన ఇద్దరు పిల్లలను విసిరేసి తాను చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసుకొని గంగాధర్​ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Last Updated : Jul 2, 2023, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details