Mother and daughter died: 24 గంటల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి.. తీవ్ర విషాదంలో కుటుంబం - Mother and daughter died in Paderu
Mother and daughter died in Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో రోజు వ్యవధిలో అమ్మ, అమ్మమ్మ మృతి చెందడంతో పిల్లలు అల్లాడిపోయారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పాడేరులో ప్రభావతి(50) అనే సోషల్ ఉపాధ్యాయురాలు. జిమాడుగుల మండలం బంధవీధి గిరిజన బాలికల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే అనుకోకుండా నాలుగు రోజుల కిందట హైబీపీ వచ్చి ఆకస్మికంగా కోమాలోకి వెళ్లగా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు తల్లి పార్వతమ్మ(70) అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందారు. అయితే ఇంతలోనే ఆదివారం ఉదయం ఉపాధ్యాయురాలు ప్రభావతి మృతి చెందారు. దీంతో అమ్మమ్మ అమ్మ రోజు వ్యవధిలో మృతి చెందగా ముగ్గురు పిల్లలు తల్లడిల్లారు.
ఉదయం తల్లికి సాయంత్రం కుమార్తెకు అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు ఉదయం తల్లి పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించి.. సాయంత్రం కుమార్తె ప్రభావతికి దాహన సంస్కరాలు చేశారు. ఉపాధ్యాయురాలి భర్త చిన్నారావు జీకే వీధి తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రభావతికి ఇద్దరు ఆడ పిల్లలు ఒక కొడుకు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె ఇంటర్ పూర్తి కాగా రెండవ కూమారుడు ఇంటర్ చదువుతున్నాడు. మూడవ కుమార్తె పదవ తరగతి చదవుతోంది. అయితే వీరు అంతా చిన్న పిల్లలు కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.