ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister_Dharmana_Prasada_Rao

ETV Bharat / videos

Minister Dharmana Prasada Rao on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌కు సపోర్ట్‌కు చేస్తున్నవారికి అవగాహన కల్పించండి: మంత్రి ధర్మాన - ycp Minister Dharmana Prasada news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 10:25 PM IST

Minister Dharmana Prasada Rao on Chandrababu Arrest:తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ను ఇష్టపడే మత్స్యకారులు.. ఇంకా చంద్రబాబు నాయుడ్ని సపోర్ట్ చేయడం ఏమిటి..? అని ప్రశ్నించారు. కొంతమంది అమాయక మత్స్యకారులు చంద్రబాబును నమ్మే పరిస్థితులో ఉన్నారని, అటువంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి ధర్మాన అన్నారు. 

Dharmana Prasada Rao Comments:శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న జ్యోతిబాపూలే పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్రా ఐదు స్టాల్స్‌ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మత్స్యకారులకు చేసిన అన్యాయాలను ప్రతి మత్స్యకారుడు గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులను హీనంగా చూసిందని.. చంద్రబాబును కలిసేందుకు విశాఖపట్నం వెళ్లినప్పుడు తోక కట్ చేయాలని ఆయన మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని కోరారు. మత్స్యకార గ్రామాల్లో చంద్రబాబు అరెస్ట్‌కు సపోర్ట్‌కు చేస్తున్న అమాయక మత్స్యకారులకు అవగాహన కల్పించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు హితబోధ చేశారు.

ABOUT THE AUTHOR

...view details